Mega Star Chiranjeevi Comments On Hero Suman Issue Waltair Veerayya Promotions
mictv telugu

వాడొక పోరంబోకు శాడిస్ట్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!

January 11, 2023

1990లలో వచ్చిన గ్యాంగ్ లీడర్ ని మరిపిస్తూ.. అప్పటి కల్ట్ లుక్స్‌లో చిరంజీవిని మరోసారి తెరపై చూపెట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది. ఏకంగా చిరంజీవే వరుస పెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఎప్పుడు లేనట్టు వన్ టు వన్ ఇంటర్వ్యూస్, బుల్లితెర షోస్‌లో మెగాస్టార్ రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్టుకి ఇచ్చిన తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలని చెప్పుకొచ్చారు చిరంజీవి. మెగాస్టార్ లైఫ్‌లో మాయని మచ్చలా మిగిలిపోయిన సీనియర్ హీరో సుమన్ అంశాన్ని జర్నలిస్ట్ లేవనెత్తగా.. ‘అంత నా కర్మ ఇలాంటి వాటికి కూడా జవాబు ఇవ్వాల్సి వస్తుంది’ అంటూ వాపోయారు మెగాస్టార్. చిరంజీవి జీవితంలో అత్యంత వివాదాస్పద అంశం హీరో సుమన్ ఇష్యు. చిరంజీవితో సమానంగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సుమన్ జైలుపాలయ్యారు. అప్పట్లో ఆ నెపం చిరంజీవిపై పడింది. తనకి పోటీగా ఉన్నాడనే సుమన్‌ని చిరంజీవి కేసులో ఇరికించాడని పెద్ద ఎత్తున రూమర్స్ రాగా.. అవి ఇప్పటికి మాయని మచ్చలానే ఉండిపోయాయి.
అయితే ఇప్పటి వరకు ఈ రూమర్స్ పై చిరంజీవి ఎప్పుడూ స్పందించలేదు. తొలిసారి వాల్తేరు వీరయ్య ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఒక పోరంబోకు జర్నలిస్ట్ కారణంగా నాకు ఈ చెడ్డపేరు వచ్చిందని ఫైర్ అయ్యారు. సుమన్ ఇష్యూపై మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘సుమన్ జైలు పాలైనప్పుడు.. నాపై బురదచల్లారు. ఆరోపణలు చేశారు. ఛీ.. ఛీ.. చీ.. ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను సుమన్ మంచి స్నేహితులం. మధ్యలో ఎవడో పోరంబోకు జర్నలిస్ట్.. ఏదో రాశాడు. పోరంబోకు అనే మాట హార్ష్‌గా ఉండొచ్చు కానీ.. వాడు ఏదో రాశాడా.. రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ.. ఇప్పటికి వందలసార్లు సుమన్ ఏం లేదని చెప్పాడు. ఆయనకి నాకు ఎలాంటి విరోధం లేదు.. ఇప్పటికీ మేం మాట్లాడుకుంటాం. కానీ వీళ్లు మాత్రం శాడిస్ట్‌లా మాట్లాడుతుంటారు. పదే పదే ఇవే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గచేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు’ అంటూ తనపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు చిరంజీవి.