టాలీవుడ్లో ఫ్యాన్స్ వార్ గురించి తెలిసిందే. తమ హీరో గొప్ప అంటే లేదు మా హీరో గొప్ప అంటూ గొడవలు జరిగిన సందర్భాలున్నాయి. ప్రధానంగా మెగా, నందమూరి అభిమానుల మధ్య చాలా కాలం నుంచి ఈ వార్ నడుస్తుంది. పలు వేదికలపై తామంతా ఒక్కటే అని హీరోలు చెబుతున్నారు. ఇటీవల అన్‌స్టాపబుల్ టాక్ షోలో కూడా పవన్, బాలకృష్ణ సందడి చేశారు. అయితే ఫాన్స్ మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. అభిమాన హీరోల సినిమాలు విడుదలైన సమయంలోనే కాకుండా బయట ఆడియో ఫంక్షన్లు, పార్టీలలో గొడవలకు దిగతున్నారు. తాజాగా అమెరికాలో తెలుగు వారంతా కలిసి ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ ఈవెంట్లో మెగా, నందమూరి అభిమానులు ఘర్షణ పడడం చర్చనీయాంశంగా మారింది.
డల్హాస్ ప్రవాసాంధ్రులంతా కలసి న్యూ ఇయర్ సెల్రబేషన్స్ చేసుకున్నారు. ఇందుకోసం “తగ్గేదే లే” పేరుతో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఓ టాలీవుడ్ హీరోయిన్ను కూడా ముఖ్య అతిథిగా వచ్చారని సమాచారం.అయితే ఈవెంట్లో భాగంగా బాలకృష్ణ పాటలు వేసి..జై బాలయ్య నినాదాలతో నందమూరి అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు చిరంజీవి, పవన్ పాటలు వేయాలని కోరారు. అందుకు వారు నిరాకరించడంతో గొడవ మొదలైంది.
చంద్రబాబు సన్నిహితుడు కేసీ చేకూరి..మెగా అభిమానులపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.చిరంజీవి పాటల వేయం ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అంటూ ఘర్షణకు దిగారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా చిరంజీవి, పవన్ బ్యానర్లు కూడా కాల్చివేశారని చెప్తున్నారు. అడ్డుకున్న సెక్యూరిటీపై కూడా దాడి చేసినట్లు సమాచారం. చివరికి గొడవ పెద్దది కావడంతో అమెరికన్ పోలీసులు కేసీ చేకూరి అరెస్ట్ చేసి జైలు తరలించారు.
తెలుగుదేశం పార్టీ NRI విభాగంలో కీలక సభ్యుడు కేసీ చేకూరి. అమెరికాలో చంద్రబాబు, లోకేష్‌ల ప్రధాన అనుచరుడుగా ఆయన ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో పాటు పార్టీకి విస్తృత ప్రచారం కల్పిస్తారు. దీంతో కేసీ చేకూరిని విడిపించేందుకు టీడీపీ పెద్దలు రంగంలోకి దిగారు.
ఇవి కూడా చదవండి :
అంతరిక్షానికి చేరుకున్న సినిమా
కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేసిన నిర్మాత సురేష్‌బాబు.. వీడియో వైరల్
నా లైఫ్‌లో ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. శ్రీజ