Mega star chiranjeevi sensational comments on pawan political career
mictv telugu

రాజకీయాలు నాకు అవసరమా? అనిపించింది: చిరంజీవి

November 20, 2022

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా పాలిటిక్స్‌ గురించి ఏదో ఒక కామెంట్స్ చేస్తూ నిత్యం సోషల్‌ మీడియాలో నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈక్రమంలోనే తాజాగా చిరంజీవి మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎన్‌ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో మాటలు పడాలి.. అనాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించింది” తన మనసులోని మాటను బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి కూడా ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ‘నా మనస్సు నుంచి రాకపోతే దేని అంతూ నేను చూడలేను. నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని వెనక్కి వచ్చేశాను. రాజకీయాల్లో రాణించాలంటే సెన్సిటివ్‌గా ఉండకూడదు. రాజకీయాల్లో మొరుటుతేలాలి.. బాగా రాటుతేలాలి. ఇతరులను మాటలు అనాలి.. అనిపించుకోవాలి.. ఇది నాకు అవసరమా?.. దానికి పవన్‌కల్యాణ్ తగినవాడు.. తాను అంటాడు.. అనిపించుకుంటాడు. పవన్‌కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో పవన్‌ ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో ఉంటాడు’’ అని చిరంజీవి జోస్యం చెప్పారు.