పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వరుస దెబ్బలే కారణం? - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వరుస దెబ్బలే కారణం?

July 5, 2022

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే మలయాళ లూసిఫర్ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్ టీజర్ గ్లింప్స్ విడుదల చేయడం తెలిసిందే. దీనిని నిశితంగా పరిశీలించిన కొందరు అభిమానులు ఓ విషయాన్ని గమనించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి తన పేరులో చిన్న మార్పు చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన పేరు megastar chiranjeevi కాగా, ఈ సినిమా నుంచి megastar chiranjeeevi గా మార్చుకున్నారు. అంటే ఒక ఈ ని కొత్తగా చేర్చుకున్నారు. ఇటీవల సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో న్యూమరాలజిస్టుల సూచన మేరకు చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, రాం చరణ్‌లు కలిసి నటించిన ఆచార్య మూవీ ఘోర పరాజయం పాలు కావడం తెలిసిందే. మరి ఇకనుంచైనా ప్లాపులు రాకుండా వరుస హిట్లు పడుతాయోమో చూడాలి.