'ఓ వ్యక్తి ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనం ఈ ఆస్కార్' - Telugu News - Mic tv
mictv telugu

‘ఓ వ్యక్తి ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనం ఈ ఆస్కార్’

March 13, 2023

 

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని అన్నారు చిరంజీవి. మొత్తం క్రెడిట్ అంతా రాజమౌళిదే అంటూ కితాబులు ఇచ్చారు. దర్శకధీరుడు ధైర్యం, పట్టుదల వలనే ఇది సాధ్యమైందని అన్నారు.

ఓ వ్యక్తి విజన్ ఈ రోజు భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టిందని చిరంజీవి అన్నారు. కోట్ల మంది భారతీయుల మృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ బృందంలో ప్రతీ ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ తన పెద్దరికాన్ని, గొప్పతనాన్ని చాటుకున్నారు చిరంజీవి. అవార్డు వచ్చినవెంటనే ట్వీట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.