అమ్మ కోసం వంట చేసిన మెగాస్టార్..వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మ కోసం వంట చేసిన మెగాస్టార్..వీడియో వైరల్

August 10, 2020

Megastar chiranjeevi cooks for his mother.

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇనింగ్స్ లో దూకుడు పెంచారు. వరుసగా సినిమాలు చేస్తూ భారీ హిట్లు కొడుతున్నాడు. ‘ఖైదీ నంబర్ 150’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి చిరు ‘సైరా’తో భారీ విజయం అందుకున్నాడు. చిరు తన సెకండ్ ఇనింగ్స్ లో భాగంగా సోషల్ మీడియాలో కూడా అడుగుపెట్టారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ లలో అకౌంట్స్ ఓపెన్ చేసి హల్ చల్ చేస్తున్నారు. ఓ వైపు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూనే తన అభిమానులతో ప‌లు ఆసక్తికర విష‌యాల‌ని పంచుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

ఆదివారం ఉద‌యం తాను ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేస్తానంటూ ట్వీట్ చేసిన సంగతి తెల్సిందే. సాయంత్రం 4 గంటలకు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని తెలిపాడు. అయితే ఆదివారం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కలత చెందిన చిరు.. ఈ వీడియోను సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు వంట చేశారు. ఈ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.