ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును మెగా హీరో రామ్ చరణ్‌కు దక్కడంపై అతని తండ్రి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ”నాన్న.. నిన్ను చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ప్రతిష్టాత్మక ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకొన్న తర్వాత నిన్ను చూస్తే గర్వంగా ఉంది. భవిష్యత్ లో మరింత ఎదగాలని అమ్మ నేను కోరకుంటున్నాం”అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు చరణ్ స్పందిస్తూ లవ్ యూ అప్పా అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
Tweets by KChiruTweets
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారికి ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎన్డీటీవీ ప్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందించగా..ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో రామ్ చరణ్ కు ట్రూ లెజండ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును చిరంజీవికి రామ చరణ్ అంకితం చేశారు. ఇటీవలే RRR చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్నాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాతికి ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.
#WATCH | What happens when #RRR star Ram Charan (@AlwaysRamCharan) rocks the stage at NDTV-@100PipersIN Glassware #TrueLegend – everyone has to ‘Naacho Naacho’ #100PipersGlassware #BeRememberedForGood pic.twitter.com/bghfF8uM94
— NDTV (@ndtv) December 2, 2022