Megastar Chiranjeevi honoured with Indian Film Personality of the Year 2022 award at IFFI
mictv telugu

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

November 21, 2022

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది. గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. 40సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. తనకు ఈ అవార్డును ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. ఆయనకు అవార్డు లభించడంపై ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే మూవీ కూడా చేస్తున్నారు. ఇది కూడా చాలా వరకు షూట్ కంప్లీట్ చేసుకుంది. అలాగే, బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా దాదాపుగా టాకీ పార్టును కంప్లీట్ చేసేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. 2006లో చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో ఆయనను సత్కరించింది. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. వీటితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు ఆయనను వరించాయి. ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్న ఆయన తన ఖ్యాతిని మరింతగా పెంచుకుంటూనే ఉన్నారు.