‘బ్రహ్మస్త్ర’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్.. కాళ్లు మొక్కిన డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘బ్రహ్మస్త్ర’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్.. కాళ్లు మొక్కిన డైరెక్టర్

June 13, 2022

బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి భాగమయ్యారు. బాలీవుడ్‌ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఆయన చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిరు చేసిన సాయానికి సంతోషం వ్యక్తం చేసిన ఈ సినిమా డైరెక్టర్ ఆయాన్‌ ముఖర్జీ.. ఆయన కాళ్లను తాకి మర్యాదపూర్వకంగా నమస్కరించారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 15న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.