మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బాస్ ఆఫ్ ది మాస్‌తో పాటు.. మాస్ మహారాజా రవితేజ కూడా భాగమయ్యారు. ఇప్పటికే యు.ఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. నెటిజన్స్, మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగాభిమానులు సంగతి చెప్పనక్కర్లేదు.
1st half peaks
Full entertainment
Boss dance, Boss energy , action scenes 🔥🔥🔥🔥
Bgm 🔥🔥🔥
DOP mass
Bobby anna thank you 🙏🙏
Veedi chaavu nee kathaku mugimpuNa kathaku aaarambam
😍😍😍🔥🔥 pic.twitter.com/UqYI0NsrjC
— Chirag Arora (@Chiru2020_) January 12, 2023
ఇప్పటికే బెనిఫిట్ షోకు వెళ్లొచ్చిన ఫ్యాన్స్ సినిమాలోని హైలేట్ సీన్స్ గురించి ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు. ఫస్టాఫ్ బాగుందని కొందరు అంటుంటే.. ఇంటర్వెల్ సీన్ ఓ రేంజ్లో ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక డాన్సులు, పాటలు అన్నీ ఊరమాస్ అంటూ థియేటర్లలో చిందులేస్తున్నారు. రవితేజ ఎమోషన్‌తో ఏడిపించేశారని అంటున్నారు. బ్రదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయిందని అంటున్నారు. ర్యాంపేజ్ అనే మాట చాలా చిన్న పదమని దుమ్ముదుమారమేనని అంటున్నారు. మాస్ జాతర మొదలైందని, అసలు ఏమైనా సినిమానా అని రియాక్ట్ అవుతున్నారు కొందరు.
Just done with 1st half.!! Emanna movie na.. super gripping.. vintage boss in dance (including steps), comedy (laddu) what not.!! Supero super.. blockbuster on the way.. #WaltairVeerayya #BlockBusterWaltairVeerayya #PoonakaaluLoading pic.twitter.com/8lyONzAirx
— Lord Shiv (@lordshivom) January 12, 2023