చిరంజీవి నెక్ట్స్ మూవీ పేరు చెప్పేసిన శేఖర్ మాస్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి నెక్ట్స్ మూవీ పేరు చెప్పేసిన శేఖర్ మాస్టర్

April 20, 2022

shekar

మెగాస్టార్ చిరంజీవి తన కొడుకుతో కలిసి నటించిన ఆచార్య సినిమా ఈనెల 29న విడుదలవుతోంది. దీని తర్వాత మలయాళ ‘లూసిఫర్’ రీమేక్ ‘భోళా శంకర్’ నటిస్తాడు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్యగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఇదే పేరు ఖాయమని వినిపిస్తోంది. ఇదెలా బయటపడిందంటే.. డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మీరు ఏ సినిమాలకు ప్రస్తుతం పని చేస్తున్నారు అని యాంకర్ అడిగితే.. ‘రవితేజ ధమాకా, చిరంజీవి భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాను’ అని చెప్పి నాలిక్కరుచుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కాగా, శేఖర్ మాస్టర్ ఆచార్య సినిమాకు పని చేశారు. ఈ సందర్భంగా మెగా హీరోలందితో సినిమా చేశాను కానీ, పవన్ కల్యాణ్‌తో ఇంతవరకూ పని చేయలేదని చెప్పాడు. గతంలో అవకాశం వచ్చినా చేయడం కుదర్లేదనీ, ఈ సారి ఛాన్స్ వస్తే మాత్రం వదలనని స్పష్టం చేశాడు.