megastar chiranjeevi phone call to samantha on her health
mictv telugu

సమంతకి మెగాస్టార్ ఎమర్జెన్సీ కాల్..!

November 12, 2022

megastar chiranjeevi phone call to samantha on her health

సమంత యశోద సినిమా విడుదల ఏంటో కానీ.. మీడియాలో చర్చంతా మయోసైటిస్ వ్యాధి గురుంచే. యశోదకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెటింది ఈ వ్యాధి. లక్షల్లో ఒక్కరికి వచ్చే వ్యాధి అవ్వటంతో అభిమానులు అందరు సమంత జబ్బు గురించి తెలిసి తీవ్ర స్థాయిలో బాధ పడ్డారు. అసలే విడాకులు, మళ్ళీ ఏంటీ అవాంతరం అని సామ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. అంతలోనే సమంత సీరియస్ అంటూ రూమర్స్ మరింత కలవరపెట్టాయి. నేనింకా చావలేదు కానీ ఆరోగ్యం క్లిష్టంగా ఉందని సమంత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత జబ్బు ముదిరింది అని.. చర్మ మారింది అంటూ కథనాలు. దీంతో సమంత ఫ్యాన్స్ టెన్షన్ కి హద్దులు లేవనే చెప్పాలి. సమంత క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ అయితే ఎప్పటికప్పుడు సమంత ఆరోగ్యంపై వాకబు చేస్తున్న పరిస్థితి. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కారణంగా హైదరాబాద్ లో అందుబాటులో లేకున్నా.. సమంతకి టాలీవుడ్ నుండి నిత్యం ఎమర్జెన్సీ కాల్స్ వెళ్తూనే ఉంటాయట. ఆరోగ్యం ఎలా ఉంది.. సోషల్ మీడియా రూమర్స్ నిజమేనా అని అడిగి తెలుసుకుంటారట.

ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం సమంతకి ఫోన్ చేయటం చర్చనీయాంశం అవుతుంది. సినిమా బావుంటే చాలు ఫోన్ చేసి అభినందించే అలవాటున్న మెగాస్టార్.. ఆరోగ్యం గురించి అడిగి పనిలో పనిగా యశోద సక్సెస్ అయిందంటూ చిరంజీవి కంగ్రాట్స్ కూడా చెప్పారని అంటున్నారు. స‌మంత‌కు ఫోన్ చేసి అద్భుతంగా న‌టించావ‌ని అప్రిషియేట్ చేశారట. అంతే కాకుండా ప్ర‌స్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి మరీ తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పార‌ని, కొన్ని రోజులు వర్కౌట్స్ తగ్గించుకోవాలని, వ్యక్తిగత అవరోధాలు అటుంచి కెరీర్ పై ఫోకస్ పెట్టాలని పెద్దమనిషిగా సమంతకి చిరు సలహా ఇచ్చినట్టు మీడియా స‌ర్కిల్స్‌లో విశ్వ‌స‌నీయ వార్త‌. అయితే మయో సైటిస్‌తో బాధపడుతున్న సమంత రీసెంట్ ఇంటర్వ్యూలో తాను క్లిష్ట పరిస్థితిలో ఉన్నానని చెప్పటం గమనార్హం.