Megastar Chiranjeevi plans to settle in Vizag
mictv telugu

విశాఖలో చిరంజీవి కొన్న స్థలం ధర ఎంతో తెలుసా..?

January 10, 2023

Megastar Chiranjeevi plans to settle in Vizag

సంక్రాంతి పండగకు మెగస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఊపందుకున్నాయి. రెండు రోజుల కిందట (జనవరి 08) విశాఖ నగరంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఏయూ కాలేజ్ గ్రౌండ్స్‎లో ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సభలో విశాఖ నగరానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడి మనుషులకు మంచి మన్సుఉంటుందని చెప్పారు. వాతావరణం కూడా చాలా బాగుంటుందని వెల్లడించారు. రిటైర్ తర్వాత సెటిల్ అవ్వడానికి సాగర తీరం చక్కని ప్రదేశమని కొనియాడారు. అందుకే తాను కూడా వైజాగ్‌లో ఉండేందుకు ఓ ఇళ్లు నిర్మించుకునే ప్లాన్‎లో ఉన్నట్లు తెలిపారు. అందుకోసం భీమిలి రోడ్డులో ఓ స్థలం కూడా కొనుగోలు చేసానని చిరు స్పష్టం చేశారు.

చిరు అలా వైజాగ్ వచ్చేస్తానని చెబుతుంటే.. ఫ్యాన్స్ అరుపులు, కేకలు, ఈలలతో మోత మోగించారు. వైజాగ్‌లో స్థలం కొన్ని విషయం వెల్లడించగానే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక చిరు కొన్న స్థలంపై చర్చ మొదలు పెట్టేశారు. ఎక్కడ ప్లేస్ కొన్నారు. ఎంత ధరకు కొనుగోలు చేశారు, ఎక్కడ ఉండబోతున్నారన్న విషయాలను తెలుసుకొనేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ప్రకారం ఇంటి స్థలం కోసం చిరంజీవి సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ స్థలంలో బీచ్ వ్యూ కనబడేటట్లుగా ఇళ్లు నిర్మాణం త్వరలో ప్రారంభిస్తారని సమాచారం. చిరంజీవి మాత్రమే కాకుండా పలువురు తెలుగు సినీ ప్రముఖులు వైజాగ్‎లో భూములు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.