“నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అంటూ గాడ్ ఫాదర్ చిత్రంలో డైలాగ్ కొట్టిన చిరంజీవి మరోసారీ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలతో పాటు, కొరటాల శివ ఇష్యూపై చిరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల పలు వేదికలపై జనసేన అధినేత పవన్ కల్యాన్‌ను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడిన విషయం తెలిసిందే. పవన్ తనలాగా కాదు.. మంచి పవర్ ఫుల్ అని మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం ఇస్తాడని ఓ సభలో చిరు వ్యాఖ్యానించారు. పవన్ ఏదో ఒకరోజు రాజకీయాల్లో మంచి పొజిషన్లో ఉంటాడని చెప్పారు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి పవన్ అని, మొన్నటి వరకు పవన్ కు సొంతిల్లు కూడా లేదని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సత్ససంకల్పంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని, రాజకీయ ప్రక్షాళనకు పవన్ పూనుకున్నాడని కితాబిచ్చారు. అయితే, పవన్‌ను కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అటువంటి వారితో తాను మాట్లాడాల్సి వచ్చినపుడు ఇబ్బందిగా ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో జనసేనలోకి చిరంజీవి వస్తాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయంలో పవన్‌కు మద్దతు ఇస్తారు, ప్రచారం చేస్తారంటూ ఎవరికి తోచింది వారు విశ్లేషించారు. మరోసారి ఇటీవల విశాఖలో సెటిల్ అవుతా, స్థలం కూడా కొన్నాను అని వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ప్రకటించారు. తాజాగా మరోసారి ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే తరహా ప్రశ్నలు సంధించడంతో చిరంజీవి ఇంట్రెస్టింగ్ సమాధాన మిచ్చారు.
ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ పక్కరాష్ట్రం తెలంగాణలో ఉన్నానని..తనుకు అక్కడి రాజికీయాలతో ఏంటీ సంబంధమని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోందో తనకు తెలియదని, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తనకు లేదని అన్నారు. ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించినట్లు వెల్లడించారు. వంద శాతం రాజకీయాల్లో స్పష్టం చేశారు మెగాస్టార్. ఇక తన ఇంటికి న్యూస్ పేపర్లు కూడా రావని చెప్పారు. తనకు విశాఖ నగరం, అక్కడి వాతావరణం అంటే ఇష్టమని అందుకే అక్కడ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన కోరికకు, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. గతంలో తాను దర్శకుల గురించి చేసిన వ్యాఖ్యలు కొరటాల శివను ఉద్దేశించి చేసినవి కాదని చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.