తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని రోజులుగా పెద్దరికంపై విపరీతమైన చర్చ జరగుతుంది. ఇండస్ట్రీ పెద్ద ఎవరనేదానిపై ఎవరికి తోచింది వారు మాట్లాడారు. దీనిపై మరోసారి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి పెదరాయడు కుర్చీ అవసరం లేదన్నారు. అయితే కళాకారుల సంక్షేమం కోసం ఎప్పుడు ముందు ఉంటానని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్ చిత్రపురి కాలనీ నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు.
సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక గృహ ప్రవేశాన్ని చిరంజీవి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. “సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది. అనిల్ , దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు.
సినీ కార్మికులకు తెలుగులోనే తప్పా..భారత దేశంలో ఎక్కడా ఇలాంటి గృహ సముదాయం లేదు. సినీ కార్మికులకు ఎప్పుడు ఏ కష్టంగా వచ్చినా అండగా ఉంటా. సినీ కార్మికులు, కళాకారులు నా కుటుంబసభ్యులతో సమానం. నా సంపాదనలో వాళ్ల కోసం కొంత భాగాన్ని ఖర్చు చేస్తున్నా. పెద్దరికం అనుభవించాలని నాకు లేదు. అవసరం వచ్చినప్పుడు వారి కోసం తప్పకుండా భుజం కాస్తా. సినిమా ఇండస్ట్రీలో నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు” అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి :