సైరా.. అమెజాన్‌లో రేపే విడుదల  - MicTv.in - Telugu News
mictv telugu

సైరా.. అమెజాన్‌లో రేపే విడుదల 

November 20, 2019

Megastar chiranjeevi starred syera to stream on amazon prime video from tomorrow

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రామ్‌‌చరణ్‌ తేజ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.  చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మహాత్మగాంధీ 150వ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 

తాజాగా సైరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ శుభవార్త అందించింది. సైరా నరసింహారెడ్డి సినిమా నవంబర్21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రేపే అమెజాన్‌ విడుదలవుతుండగా హిందీ వర్షన్‌ మాత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై కూడా భారీ క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇంట్లోనే డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై వీక్షిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా రిలీజ్‌ అయిన 40, 50 రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌‌లో మల్లేశం, దొరసాని సినిమాలు విడుదలైనవి.