మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి ఇప్పటికే బాస్ సాంగ్ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యే ఈ చిత్ర టైటిల్ సాంగ్ ని సోమవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో దేవీశ్రీ మ్యూజిక్ ఆకట్టుకోగా, చంద్రబోస్ రాసిన లిరిక్స్ పాత్ర క్యారెక్టర్ ని సూచిస్తూ సాగింది. అనురాగ్ కులకర్ణి గాత్రదానం చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. మెగాస్టార్ చిత్రం కాబట్టి మంచి అంచనాలే ఉండగా, ఇటీవల దర్శకుడు బాబీ చెప్పిన మాటలతో అవి మరింత భారీగా పెరిగాయని చెప్పవచ్చు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, వీరయ్య ప్రస్తావన వచ్చిన ప్రతీసారి అభిమానులు ఈలలు, కేకలు వేస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. దర్శకుడిగా బాబీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో సినిమా విజయంపై భరోసాతో ఉన్నారు.