సినీకార్మికులకు చిరంజీవి అండ.. రూ. కోటి విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

సినీకార్మికులకు చిరంజీవి అండ.. రూ. కోటి విరాళం

March 26, 2020

Megastar chiranjeevi Support for movie workers.. One Crore rupees donate

కరోనా కష్టాన్ని గట్టు ఎక్కించేందుకు సినీ ప్రముఖులు కదులుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో రోజువారి సినీ కార్మికులకు కష్టం వచ్చి పడింది. వారిని ఆదుకోవడానికి హీరో రాజశేఖర్ ఇప్పటికే వారికి నిత్యావసర వస్తువులను అందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు అందించారు. ఇండస్ట్రీలో ఉన్న రోజువారి కూలీలకు, అలాగే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లకు తన వంతు సాయంగా ఈ చిన్న సాయం చేస్తున్నట్లు చిరంజీవి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై చిరు ప్రశంసలు కురిపించారు. దయచేసి అంతా ఇంట్లోనే ఉండి ఈ 21 రోజుల యుద్ధంలో గెలుద్దాం అని ట్వీట్ చేశారు.

కాగా, చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే రెండు కోట్లు ప్రకటించారు. అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ రూ.75 లక్షలు ప్రకటించారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.20 లక్షలు, అనిల్ రావిపూడి రూ.10 లక్షలు, కొరటాల శివ రూ.5 లక్షలు ప్రకటించారు.