ఇక మెగా కెరీర్ క్లోజా.. ఇదే ఆఖరి అవకాశమా! - MicTv.in - Telugu News
mictv telugu

ఇక మెగా కెరీర్ క్లోజా.. ఇదే ఆఖరి అవకాశమా!

October 26, 2022

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ చాల కాస్లీ అవుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఖైదీతో రీఎంట్రీ ఇచ్చినా మునుపటి క్రేజ్ మాత్రం దక్కటం లేదు. సైరా యావరేజ్, ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ డిఫరెంట్ మూవీ అని పేర్లు వచ్చాయి కానీ ఒకప్పటిలా బాక్సాఫీస్‌ని షేక్ చేయలేకపోయాడు. అయితే చిరంజీవి అంటేనే ఊరమాస్ సినిమాలు. ఓవర్ ది టాప్ హీరోయిజం, డాన్సులు, ఫైట్స్ ఇవన్నే చిరంజీవిని మెగాస్టార్‌ను చేశాయి. అయితే సినిమాల్లో రీఎంట్రీ తరువాత వాల్తేరు వీరయ్య పాత్రతో.. ఇన్నాళ్లకు తనని మెగాస్టార్‌ని చేసిన జానర్‌ని ఎంచుకున్నాడు చిరంజీవి. నిన్న విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ మెగా ఫాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. చిరు వేసిన లుంగీ, బీడి కాల్చిన స్టైల్ ముఠామేస్త్రిని గుర్తుకుతెచ్చింది. సైరా లాంటి పాన్ ఇండియా మూవీస్, ఆచార్య లాంటి క్లాస్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ వంటి డిఫరెంట్ కంటెంట్ నమ్మకం లేకనో.. లేక తన పూర్వ వైభవం రావాలంటే కమర్షియల్ కథలని చేయాలనుకున్నాడో కానీ వాల్తేరు వీరయ్యగా వచ్చేసాడు చిరు.

అయితే ఇక్కడే ఒక రిస్క్ ఉంది. కరోనా తరువాత ఓటీటీ ఎంట్రీతో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారింది. ఫాన్స్, ఊరమాస్ క్రౌడ్ కాకుండా జనాలంతా క్రియేటివ్ కంటెంట్‌ని ఇష్టపడుతున్నాడు. కొత్తదనం లేకుంటే ఎంతటి హీరోలనైనా రిజెక్ట్ చేస్తున్నారు. మూస కమర్షియల్ సినిమాల మొహం కూడా చూడటంలేదు. వాల్తేరు వీరయ్యలో లుక్స్, నడక, గెటప్ ఇలా అన్నీ కూడా వింటేజ్ చిరంజీవిని గుర్తుకుతెచ్చినా మెగా ఫాన్స్‌ను మాత్రమే ఈ జిమ్మిక్కులు అలరిస్తాయి. సినిమా ఏ మాత్రం తేడ కొట్టినా మళ్ళీ ఆచార్య సీన్ రిపీట్ అవుతుంది. చిరు కోసం ఒకసారి థియేటర్ కి వెళ్దాంలే అన్న రోజులు ఇప్పుడు లేవు. అందుకే ఇది చిరంజీవికి టెస్టింగ్ టైం అంటున్నారు క్రిటిక్స్. వయసుకు తగిన పాత్రలు వేసి జనాలను అలరించే సినిమాలు ఇవ్వలేక వెనుకపడ్డారు చిరు. ఇప్పుడు వయసు పక్కన పెట్టి మళ్లీ పాత తరం సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ పైనే మెగాస్టార్ ఫేట్ డిసైడ్ కానుందని అంచనాలు వేస్తున్నారు సినీ విశ్లేషకులు.