మెగా అభిమానులకు పండగ...చిరంజీవి కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

మెగా అభిమానులకు పండగ…చిరంజీవి కీలక నిర్ణయం

March 24, 2020

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు తీపి కబురు అందించారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా అకౌంట్స్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌కు సంబంధించిన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో ద్వారా తెలియజేశారు.

చిరంజీవి ఇప్పటి వరకు తన అభిప్రాయాలను వీడియో రూపంలో ప్రెస్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెల్సిందే. ‘నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను. నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు, చెప్పాలనుకునే విషయాలను ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్ మీడియాను వేదికగా భావిస్తున్నాను. అందేకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను. అది కూడా ఈ ఉగాది నుంచే’ అంటూ చిరంజీవి వీడియోలో పేర్కొన్నారు. చిరు సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్న వార్త తెలియడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.