megastar chiranjeevi tweet on nandamuri tarakratna health update
mictv telugu

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి భావోద్వేగ ట్వీట్

January 31, 2023

megastar chiranjeevi tweet on nandamuri tarakratna health update

నందమూరి హీరో తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతుంది. ఆయనను రక్షించేందుకు వైద్యులు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. సోమవారం ఆస్పత్రి వర్గాలు విడుదుల చేసిన హెల్త్ అప్డేట్‌ ప్రకారం తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స వైద్యులు అందిస్తున్నారు. ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని.. కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తాజా హెల్త్ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు.మరోవైపు తారకరత్నను చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి తరలివస్తున్నారు.అతడి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకుంటున్నారు.

తాజాగా తారకరత్న ఆరోగ్యం పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తారకరత్నకు ఇంకా ఏ ప్రమాదం లేదని తెలిసి సంతోషంగా ఉందన్నారు.”సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.