మెగాస్టార్ చిరంజీవి అభిమానులతోపాటు మాస్ రాజా రవితేజ అభిమానులు, మొత్తం టాలీవుడ్ జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ వచ్చేసింది. హీరో చిరు ఎప్పట్లాగే మహా మాస్ లుక్స్, డైలాగ్స్, డ్యాన్సులతో అదరగొట్టాడు. చాలా పెద్దే కథే ఉన్నట్లు సీన్లు చెబుతున్నాయి. రవితేజ కూడా తనదైన స్టయిల్లో పంచులు విసురుతూ రెచ్చిపోయాడు. చేపలవేట, మాఫియా, ఫారిన్ టూర్స్ వంటి వాటిచుట్టూ కథ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. 60వ పడిలో ఉన్న చిరంజీవి ముప్పై నలభై ఏళ్ల హీరోలాగా చెలరేగిపోయాడు. పూనకాలే బాసూ అంటూ అభిమానులు ఈ ట్రైలర్ పై కామెంట్లు చేస్తున్నారు. అయితే హైప్ చేసినంత స్థాయిలో ట్రైలర్ లేదని, రొటీన్ కథలా ఉందని కొందరు పెదవి విరుస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో విడుదల కానుంది.