సీనియర్ స్టార్ హీరో సుమన్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ చెప్పడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఒకప్పడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిందనే పుకార్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. చిరంజీవితో సుమన్‌కు విభేదాల ఉన్నాయని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ విషయమై సుమన్ పలు ఇంటర్వ్యూల్లో కూడా ఖండించారు. ఇక చిరంజీవి కూడా ఇదంత పుకార్లని కొట్టిపారేసారు. ఈయన నటుడిగా సుమన్.. 45 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సుమన్ నట ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయను అభినందిస్తూ.. ఒక వీడియో కూడా తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. మై డియర్ సుమన్.. మీరు సినీ ఇండస్ట్రీలో 45 యేళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. నటుడిగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా 10కి పైగా భాషల్లో సినిమాలు చేయడం మాములు విషయం కాదన్నారు. ఇది గొప్ప విజయం అన్నారు. 45 యేళ్ల సినీ ప్రయాణం,.. మీ కమిట్‌మెంట్, డెడికేషన్‌కు నిదర్శనం అన్నారు. మీరు ఇలాగే సినీ ఇండస్ట్రీలో ఈ అరుదైన ఫీట్ సాధించినందకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్టు చిరు చెప్పారు. అలాగే మీరు మరిన్ని సంవత్సరాలు ప్రేక్షకులకు అలరించాలని చిరు కోరారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న కర్ణాటక రాష్ట్రంలో మంగళూరులో మీ 45 యేళ్ల సినీ కెరీర్ పూర్తైన సందర్భంగా ఆ వేడుక సక్సెస్ కావాలని ఆకాంక్షించారు చిరంజీవి.