రాక్ బ్యాండ్ సాంగ్‌తో ముఖ్యమంత్రి హల్‌చల్..  - MicTv.in - Telugu News
mictv telugu

రాక్ బ్యాండ్ సాంగ్‌తో ముఖ్యమంత్రి హల్‌చల్.. 

May 23, 2020

vavva

సీఎం అంటే ఎప్పుడు రాజకీయాలు, ప్రజా సమస్యలు వినడానికే సమయం సరిపోతుంది. సంతకాలు, అనుమతులు అంటూ మూసపద్దతిలో జీవితం బిజీ బిజీగా మారితుంది. కానీ వీటన్నింటికి తాను భిన్నం అని నిరూపించారు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా. తాను రిలాక్స్ అవుతూ.. తన సంగీత నైపుణ్యంతో ప్రజలకు హాయిని పంచారు. ఓ పాటకు గిటార్ వాయిస్తూ ఆయన విడుదల చేసిన 43 సెకన్ల  ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతని అభిమానులు, పార్టీ శ్రేణులు తమ ముఖ్యమంత్రి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 

ఇటీవలే అక్కడ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాదోపవాదాలు, నిర్ణయాలు అన్ని అయిపోయాయి. దీంతో కాస్త రిలాక్స్ సమయం దొరకడంతో రొటీన్‌కు భిన్నంగా ఐరన్ మెయిడ్స్ పాటకు గిటార్ వాచించారు. 1980 నాటి రాక్ బ్యాండ్ ఐరస్ మేయిడెన్ పాడిన వేస్టేడ్ ఇయర్స్ పాటకు  అనుగుణంగా దీన్ని వాచియించారు. కాగా సంగ్మా వాయిద్య కళలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి. అందుకే చాలా రోజుల తర్వాత ఇలా గిటార్ కళను చూపించారు. ఈ సందర్భంగా వీడియోను ప్రజలతో పంచుకుంటూ.. చాలా రోజులైంది కాబట్టి కాస్త పొరపాట్లు దొర్లి ఉండవచ్చు అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఇది చూసిన మేఘాలయ ప్రజలు తమ సీఎం ప్రశంసిస్తున్నారు. ఆయన మమ్మల్ని ప్రతిసారీ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు అంటూ మరికొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానించడం విశేషం.