ఈనెల 27న మేఘాలయాలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ర్యాలీ నిర్వహించాలని అనుకుంది. కానీ మేఘాలయా ప్రభుత్వం ప్రధానికి షాకిచ్చింది. ఫిబ్రవరి 24న షిల్లాంగ్, తురాలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది.
మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజకవర్గం దక్షిణ తురా. అక్కడ ఉన్న పీఏ సంగ్మా స్టేడియంలో మోడీ ఎన్నికల సభ ప్లాన్ చేసారు. దానికోసం ఈ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. కానీ స్టేడియంలో ఇంకా స్టేడియంలో నిర్మాణం పనులు జరుగుతున్నాయిని ర్యాలీ నిర్వహించలేమని మేఘాలయా క్రీడా విభాగం బీజెపీని తిరస్కరించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 127 కోట్లతో నిర్మించిన పీఏ సంగ్మా స్టేడియాన్ని డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ ప్రారంభించేశారు.
రెండు నెలల క్రితమే స్టేడియాన్ని ప్రారంభించేశారు కదా, ఇప్పడు పనులు పూర్తి కాలేదని ెలా చెబుతున్నారంటూ బీజెపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మేఘాలయాలో మోడీకి పెరుగుతన్న ప్రజాదరణను అడ్డుకోవడానికే అక్కడి ప్రభుత్వం ఇలా చేస్తోందని బీజెపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా విమర్శించారు. ఇంతకు ముందు జరిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజెపీ నాయకుల ర్యాలీలకు వచ్చిన ప్రజల స్పందనను చూసి ప్రభుత్వం భయపడుతోందని సిన్హా ఆరోపించారు.