ఇంట్లోనే వైన్ తయారీకి ప్రభుత్వం అనుమతి.. ఎక్కడంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లోనే వైన్ తయారీకి ప్రభుత్వం అనుమతి.. ఎక్కడంటే

September 26, 2020

x bm bnm

మద్యం ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇక నుంచి ఇంట్లోనే వైన్ తయారు చేసుకునేందుకు మేఘాలయ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎలాంటి పన్ను చెల్లించకుండా చట్టబద్ధంగా వైన్ తయారు చేసుకోవచ్చని చెప్పింది. అయితే దీనికి లైసెన్స్ కింద రూ. 7,500 చెల్లించాలని పేర్కొంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్ధాలుగా ఉన్న డిమాండ్ నెరవేరిందని వైన్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైఖేల్ చెప్పారు.

గత రెండు దశాబ్ధాలుగా దీనిపై అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీంతో సీఎం కే. సంగ్మా దీనికి అంగీకరించారు. ఇక నుంచి వైన్ ఇంట్లో తయారు చేసుకునే వీలు కల్పించారు. హోంమేడ్ ఫ్రూట్ వైన్ నిబంధనలు తెచ్చారు. దీని ద్వారా  వైన్‌ను మార్కెటులో విక్రయించేందుకు వీలు కల్పించారు. ఈ నిర్ణయంతో ఉత్పాదకత పెరిగి కుటీర పరిశ్రమ కూడా మరింత అభివృద్ధి చెంది ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.  కాగా ఇక్కడ వైన్ తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తరుచూ మేఘాలయలో వైన్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉంటాయి.