ట్రంప్ భార్య విగ్రహానికి నిప్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ భార్య విగ్రహానికి నిప్పు..

July 9, 2020

bnvbn v

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్రహాన్ని ఈ ఏడాది జనవరిలో దుండగులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్య మెలానియా ట్రంప్ సొంతూరు స్లొవేనియాలో ఉన్న ఆమె చెక్క విగ్రహానికి కొందరు దుండగులు నిప్పు పెట్టారు. 

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం అయిన జులై 4న రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని దానిని రూపొందించిన కళాకారుడు బ్రాడ్ డౌనీ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం మెలానియా రూపాన్ని పోలిన చెక్క విగ్రహాన్ని స్లొవేనియాలో ప్రతిష్టించారు. ఈ ఘటనపై జులై 5న బ్రాడ్ డౌనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డౌనీ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.