మెలానియా డ్రెస్‌పై ‘బీజేపీ కమలాలు’! నిజమా? - MicTv.in - Telugu News
mictv telugu

మెలానియా డ్రెస్‌పై ‘బీజేపీ కమలాలు’! నిజమా?

February 25, 2020

Melania Trump.

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు రెండోరోజు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రోజు ఆమె రకరకాల పువ్వులు ఉన్న తెల్లటి దుస్తులను ధరించారు. 

అయితే ఆ డ్రెస్‌పై కమలం పువ్వులు ఉన్నాయని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కమలం అంటే భారత జాతీయ పుష్పం. అది భారతీయ జనతా పార్టీ ఎన్నికల చిహ్నం కూడా కావడం గమనార్హం. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండడంతో ఆమె కమలం పువ్వులున్న డ్రెస్ ధరించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు అవి కమలం పువ్వులు కావని కామెంట్లు పెడుతున్నారు. అవి పూలలాగే ఉన్నాయని, అయితే ఆకులు మాత్రం కమలాల ఆకులు కాదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ డ్రెస్ ఖరీదు దాదాపు 1.15లక్షల రూపాయలు ఉండడం గమనార్హం.