రానా పెళ్లి ప్రభాస్ చావుకొచ్చింది.. బీభత్స మీమ్స్  - MicTv.in - Telugu News
mictv telugu

రానా పెళ్లి ప్రభాస్ చావుకొచ్చింది.. బీభత్స మీమ్స్ 

May 13, 2020

hdhgdfgh

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందని సామెత. దీన్ని టాలీవుడ్లో రానా పెళ్లి, ప్రభాస్ చావుకొచ్చిందిగా మార్చేశారు. నిఖిల్, నితిన్ పెళ్లిపీటలు ఎక్కేశారూ. బొడ్డూడని కుర్రహీరోలు కూడా లవ్ ఎఫైర్లు నడుపుతున్నాయి. దీంతో బ్యాచిలర్ల లిస్టులో పేర్లు తగ్గుతున్నాయి. కానీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ల లిస్టులో డార్లింగ్ ప్రభాస్ టాప్ నుంచి దిగిరావడం లేదు. 

రానా తాను మిహిక అనే యువతిని ప్రేమించానని, ఆమె కూడా ఓకే చెప్పిందంటూ నిన్న ఆమెతోకలసి ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం తెలిసిందే. అతణ్ని అబినందిస్తూ నెటిజన్ల ప్రభాస్ ను తొందర పెడుతూ సరదా చిత్రాలు తయారు చేస్తున్నారు. పైగా కరోనా కాలం కూడా కావడంతో అదే పనిగా కూర్చుని మీమ్స్ తయారు చేస్తున్నారు. డార్లింగ్.. ప్లీజ్ ఇప్పుడైనా ఏదో ఒకటి చెప్పవా? అని బతిమాలుతున్నారు. మేం చెప్పడం ఎందుకు? మీరే చూడండి!