పెళ్లికి ముందు మగాళ్లంతా సింహాలే.. ధోనీ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి ముందు మగాళ్లంతా సింహాలే.. ధోనీ

November 27, 2019

Men are lions until they get married, says MS Dhoni

పెళ్లికి ముందు మగాళ్లు అందరూ సింహాలే అంటూ నవ్వులు పూయించాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. పెళ్లయ్యాక మగాళ్ల కథ మారిపోతుందని.. అసలు కథ అదేనని తమాషాగా అన్నాడు ధోనీ. తాజాగా చెన్నైలో ధోనీ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇలా గమ్మత్తుగా మాట్లాడాడు ధోనీ. ఇందులో కొందరు ఔత్సాహికులు ఆయన వివాహ బంధంపై ప్రశ్నలు వేశారు. అందుకు ధోనీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు.

 

ఒక ఆదర్శ భర్తకు ఉండాల్సిన లక్షణాల కంటే ఎక్కువే తనకు ఉన్నాయని, తన భార్యను నిత్యం సంతోషంగా ఉంచుతానని ధోని వెల్లడించాడు. ‘నా భార్య ఏం చేయాలనుకున్నా తోడ్పాటును అందిస్తా. నా భార్య ఆనందంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నా భార్య ఏం చేయాలనుకున్నా ఆ పనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తను ఆనందంగా ఉంటుంది. పెళ్లి గురించి దాని పరమార్థం గురించి తెలుసుకోవాలంటే మనకు 55 సంవత్సరాల వయసు దాటాలి’ అని చమత్కరించాడు ధోనీ. 

ఇదిలావుండగా క్రికెట్ వరల్డ్ కప్ ముగిసి దాదాపు నాలుగు నెలలు గడిచిపోయింది. అయితే ధోనీ మాత్రం ఇంకా మైదానానికి దూరంగానే ఉంటున్నాడు. క్రికెట్‌లో కొనసాగుతాడా.. లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా వంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వచ్చే మార్చిలో జరిగే ఆసియా లెవన్-వరల్డ్ లెవన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. రెండు టీ20ల సిరీస్‌కు బంగ్లాదేశ్ వేదిక కానుంది.