మీకు ఉదయాన్నే అంగస్తంభన కలుగుతుందా.? - MicTv.in - Telugu News
mictv telugu

మీకు ఉదయాన్నే అంగస్తంభన కలుగుతుందా.?

June 14, 2022

ప్రతి ఉదయాన్నే మీకు అంగస్తంభన క‌లుగుతుందా.. ? అయితే మీకిది కచ్చితంగా గుడ్ న్యూసే. ఉదయాన్నే అంగస్తంభన కలిగే పురుషులకు గుండె జబ్బులు, పక్షవాతంతో చనిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం సూచించింది. బెల్జియంలోని 1,800 మంది మధ్య వయస్కులు, వృద్ధులపై స్టడీ చేసిన శాస్త్రవేత్తలు.. వారిని ‘ఉదయం అంగ‌స్తంభ‌న‌’ గురించి అడిగారు. స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి, ఉదయం అంగస్తంభనలు ఉన్నవారికి.. హార్ట్ స్ట్రోక్‌లతో సహా ఇతర డేంజరస్ వ్యాధుల నుండి చనిపోయే అవకాశం దాదాపు 22% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇక‌, రాత్రిపూట అంగస్తంభనలు మంచి ప్రసరణకు సంకేతమని పరిశోధకులు విశ్వసిస్తున్న‌ట్లు అధ్యయనం వివరించింది.

ఇకపోతే… అంగస్తంభన లోపం ఉండ‌టం, ఉదయం పేలవమైన అంగస్తంభనలు అనేవి, పెరుగుతున్న మరణాలకు సంబంధం ఉంటుంద‌ని ఈ స్టడీ ప్రధాన శాస్త్రవేత్త, బెల్జియం కాథోలీకే యూనివర్శిటీ లియువెన్‌ ఎండోక్రినాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీన్ ఆంటోనియో తెలిపారు. ఉదయం అంగం కనుకు స్తంభించనట్లయితే.. మీ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు సరిగ్గా పనిచేయడం లేదని తెల‌ప‌డానికి సంకేతమని బ్రిటిష్ సొసైటీ ఫర్ సెక్సువల్ మెడిసిన్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ జియోఫ్ హాకెట్ తెలిపారు. దీని వ‌ల్ల అతి తొందరగా గుండెపోటు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.