Home > Corona Updates > ఉంగరం వేలు పొడుగ్గా ఉంటే కరోనా రాదంట!

ఉంగరం వేలు పొడుగ్గా ఉంటే కరోనా రాదంట!

Ring Finger.

కరోనా వైరస్ పరిశోధనల్లో భాగంగా స్వాన్ సీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఉంగరం వేలు పొడవుగా ఉంటే పురుషులకు కరోనా ముప్పు తక్కువని, ఉంగరం వేలు పొట్టిగా ఉంటే కరోనా ముప్పు ఎక్కువని వెల్లడించారు. దీంతో 41 దేశాలకు చెందిన పురుషుల ఉంగరం వేళ్లపై పరిశోధన నిర్వహించారు. అయితే ఉంగరం వేలు పెరుగుదలకు గర్భస్త శిశువుపై టెస్టోస్టిరాన్ ప్రభావానికి సంబంధం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. గర్భంలోని ఓ పురుష శిశువు ఎంత ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు అంత పొడవు పెరుగుతుందని వివరించారు.

పిండం తక్కువ మోతాదులో టెస్టోస్టిరాన్ ప్రభావానికి గురైతే ఉంగరం వేలు తక్కువ పొడవు పెరుగుతుందని చెప్పారు. టెస్టోస్టిరాన్ హార్మోనే కరోనా నుంచి కాపాడే రక్షక కవచాలైన ఏసీఈ-2 గ్రాహకాలను శరీరంలో ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు వైరస్ తాలూకు లక్షణాలు తగ్గించడంలో ఏసీఈ-2 గ్రాహకాలు తోడ్పడతాయన్నారు.

Updated : 26 May 2020 9:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top