కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు. కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిభాపూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటి హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయాన ఓ మొక్కను నాటి అందరూ తమవంతుగా తప్పనిసరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.