Men's Close Call With Elephant Herd While Taking Selfies Leaves Internet Furious
mictv telugu

ఏనుగుల గుంపును కెలికిన సెల్ఫీ పిచ్చోడు… ఇదీ సీన్!

August 8, 2022

సెల్ఫీల పిచ్చితో చాలామంది యువత సాహసాలు చేస్తున్నారు. జలపాతాల వద్ద, కొండ ప్రాంతాల వద్ద, ఎత్తైన బ్రిడ్జిల వద్ద, వెళ్తున్న వాహనానికి వేలాడుతూ.. ఇంకా చెప్పాలంటే జూ లో క్రూర జంతువులతో సెల్ఫీలు దిగడం వంటివి ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇలా కొందరు సెల్ఫీ కోసం ప్రమాదాల్లో పడిపోయి తమ జీవితాన్నే పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా కొంతమంది యువకులు అలాంటి సాహాసమే చేశారు. సెల్ఫీలు దిగాలని ఏనుగులతో పరాచకాలు ఆడారు. అదృష్టం కొద్దీ ఆ ఏనుగులు వీరిపై జాలి చూపించాయి.లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది.

ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ… “అడవి జంతువులతో సెల్ఫీ మోజు చాలా ప్రాణాంతకం. ఈ వ్యక్తులు అదృష్టవంతులు.ఎందుకంటే ఏనుగులు వారిని చేష్టలను భరించాయి. వీరికి తగిన గుణపాఠం నేర్పించడానికి ఏనుగులకి పెద్ద కష్టమేం కాదు” అని పేర్కొన్నారు. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు యువకులు నడిరోడ్డు మీదకి వచ్చిన ఒక ఏనుగులు గుంపుతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. అనంతరం వాటికి దగ్గరగా వెళుతూ సెల్ఫీ లకు ఫోజులు ఇచ్చారు. ఒకానొక సమయంలో ఆ ఏనుగులు వీరి వైపు తరుముకుంటు వచ్చి తొండంతో వార్నింగ్ ఇచ్చినట్లు బెదిరించాయి. దాంతో వారంతా కూడా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ఆ ఏనుగులు ఎందుకో శాంతించి మళ్ళీ తమ దారిన అవి వెళ్లిపోయాయి. లేదంటే ఆ యువకులంతా ఏనుగుల ధాటికి నుజ్జునుజ్జు అయిపోయేవారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ యువకులను తిట్టిపోస్తున్నారు.