వంటింట్లోకీ రానిచ్చేవారు కాదు.. కాలం మారింది.. సీఎం విజయన్ - MicTv.in - Telugu News
mictv telugu

వంటింట్లోకీ రానిచ్చేవారు కాదు.. కాలం మారింది.. సీఎం విజయన్

October 8, 2018

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్సుపై ఓవైపు నిరసనలు భగ్గుమంటున్నాయి.. మరోవైపు తీర్పును హర్షిస్తూ పలువురు ముందుకొస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్పుకు మద్దతిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పును సవాల్ చేయబోమని, దాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ytyy

‘పూర్వం రోజుల్లో రుతుక్రమంలో ఉన్న మహిళలను అపవిత్రులుగా భావించి ఇళ్లలో నుంచి బయటకు పంపేసేవారువారిని వంటగదిలోకి కూడా రానిచ్చేవారు కాదు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  సమాజంలోని విభిన్న వర్గాలు ఇలాంటి తప్పుడు సంప్రదాయాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలోంచి వచ్చిందే తాజా సుప్రీం తీర్పు’ అని అన్నారు.

సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆరెస్సెస్, బీజేపీలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా అయ్యప్ప భక్తులను పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం తీర్పు వెలువడిందని… దాని అమలు కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం పూనుకుందని ఆరెస్సెస్ , బీజేపీ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ విషయమై వారితో చర్చలు జరిపేందుకు పినరయి సిద్ధంకాగా, పందాలం ప్యాలెస్, శబరిమల ఆలయ అర్చకులు తిరస్కరించారు. శబరిమల విషయంలో బీజేపీ గందరగోళం చేస్తోందనీరాజకీయ పార్టీలు ప్రగతి చర్యలు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడిందని సీఎం అన్నారు.