నోటి మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ‘నందమూరి సింహం’ అని జూలు విదిలించే బాలయ్యలాంటి వాళ్లకు అలాంటివేమీ పట్టవు. ఆవేశంలోనో, కావాలనో ఓ మాట అనడం, వివాదాలు కొని తెచ్చుకోవడం, తర్వాత క్షమాపణ చెప్పడం బాలకృష్ణకు అలవాటైపోయింది. ఇటీవల దేవాంగ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సారీ చెప్పిన బాలయ్య మళ్లీ అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆయనను విమర్శిస్తూ వస్తున్న పోస్టులే దీనికి ఉదాహరణ. ట్విటర్లో #MentalBalaKrishna హ్యాష్‌ట్యాగ్ భీకరంగా నండుస్తోంది. అక్కినేని హీరోల అభిమానులతోపాటు బాలయ్య అంటే గిట్టని జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
‘అక్కినేని తొక్కినేని’ అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితం ఇది.
అక్కినేని నాగ చైతన్య, అఖిల్ బాలయ్యను సుతిమెత్తిగా దుయ్యబట్టినా వారి అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు. మెంటల్బాలయ్య అనే హ్యాష్ ట్యాగును ట్రెండింగ్ చేయడంతోపాటు, బాలయ్య సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘బాలయ్యకు మెంటల్ అని ఎప్పుడే తేలిపోయింది. డాక్టర్లు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచింది’’ అని సలహా ఇస్తున్నారు. కాగా ‘‘ఎన్టీఆర్ గారు, రంగారావుగారు, నాగేశ్వరరావు గారు తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమే’’ అని నాగచైతన్య, అఖిల్ బాలయ్యను ఉద్దేశించ ట్వీట్ చేశారు.