‘‘బాలయ్యా, జర జాగ్రత్తగా ఉండు..’’ అంటూ నటరత్న నందమూరి బాలకృష్ణను ఓ పిచ్చివాడు గట్టిగా హెచ్చరించాడు. అది కూడా తారకరత్న భౌతిక కాయం వద్దకు దూసుకొచ్చి మరీ చెప్పాడు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గుండెపోటుతో చనిపోయిన నటుడు నందమూరి తారకరత్న భౌతిక కాయాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ మోకిలాలోని సొంతింట్లో ఉంచి, తర్వాత ఫిలిమ్ చాంబర్‌కు తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించుకుని కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
ఆ సమయంలో చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ఉన్న ఓ పిచ్చివాడు అక్కడికి దూసుకొచ్చి తారకరత్నకు నివాళి అర్పించాడు. తర్వాత బాలకృష్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడాడు. వేలెత్తి చూపుతూ, నొసటిపై గీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని, ఏదో జరగబోతోందని హెచ్చరించారు. దీంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. పోలీసులు వెంటనే అతణ్ని బలవంతంగా అక్కడినుంచి బయటికి తీసుకెళ్లారు. పిచ్చివాడు ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం తిరిగేవాడని, ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో తిరుగుతున్నాడని స్థానికులు చెప్పారు. 40 ఏళ్ల నందమూరి తారకరత్న గుండుపోటుకు గురై 23 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం చనిపోయారు.