బంజారాహిల్స్‌లో ప్రేమపిచ్చోడు.. ఎత్తుకెళ్లిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

బంజారాహిల్స్‌లో ప్రేమపిచ్చోడు.. ఎత్తుకెళ్లిన పోలీసులు

November 22, 2019

ప్రేమకు దూరమైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పిచ్చోడిగా మారిపోయాడు. శుక్రవారం ఉదయం పూట  రోడ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై రాళ్లతో దాడి చేస్తూ హడలెత్తించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్3లో జరిగింది. స్థానికులపై దాడి చేసే విషయం తెలుసుకున్న పోలీసులు అతని కాళ్లు చేతులు కట్టేసి ట్రాలీ ఆటోలో పునరావాస కేంద్రానికి తరలించారు. 

Love.

తిరుమలగిరికి చెందిన రాజు  కొన్ని రోజుల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ అది విఫలం కావడంతో అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది. పిచ్చివాడిలా మారిపోయి రోడ్లపై తిరగడం ప్రారంభించాడు. మతిస్థిమితం లేక అందరిపై దాడి చేస్తున్నాడు.ఈ క్రమంలో బంజారాహిల్స్‌లో కొంత సేపు హల్‌చల్ చేశాడు.ఒంటిపై దుస్తులు లేకుండా.. దాడి చేస్తూ ఉండటంతో అటుగా వెళ్లేవారు కాస్త ఇబ్బందులు పడ్డారు. చివరకు అతి కష్టం మీద అతన్ని పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు.