mentally ill man jumping before moving bus in kerala
mictv telugu

తలతో రన్నింగ్ బస్సు ఢీ..ఫుట్‌బాల్ పిచ్చితో (వీడియో)

November 10, 2022

కేరళలో ఓ మతిస్థిమితం లేని యువకుడు చేసిన పని విస్మయానికి గురిచేసింది. ఫుట్‌బాల్ పిచ్చి అతని ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఫుట్‌బాల్ ప్లేయర్‌లా ఊహించుకున్న యువకుడు తలతో రన్నింగ్‌లో ఉన్న బస్సును ఢీకొట్టి గాయాల పాలయ్యాడు. మలప్పురం పెరింథాల్ మన్నలోని జూబ్లీ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

పైన షర్టు లేకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ యువకుడు.. ఉన్నట్టుండి ఎదురుగా వచ్చిన బస్సు వైపు దూసుకెళ్లాడు. ఒక్కసారిగా ఎగిరి తలతో బస్సు అద్దాన్ని గుద్దాడు. అయితే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన ఆతను అంతటితో ఆగలేదు…గాయాలతో బస్సు ఎక్కి డ్రైవర్ సీట్‌లో కూర్చున్నాడు. స్ట్రీరింగ్ పట్టుకోని కాసేపు హంగామా సృష్టించాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అదుపులోకి ఆస్ప్రతికి తరలించి చికిత్స అందించారు.మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చి కోజికోడ్ లోని మెంటల్ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తాను బ్రెజిల్ జట్టు ఫుట్‌బాల్ ప్లేయర్ నని, బస్సుకు ఉన్న బ్లూకలర్ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని..ఆ కోపంతో బస్సును వెళ్లి గుద్దానన్న యువకుడి ఆడియో మనకి స్పష్టంగా వినపడుతోంది. అంతే కాకుండా బస్సుడ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాక నెయ్‌మర్ సహా టీం సభ్యులంతా రావాలని డిమాండ్ చేస్తూ హంగామా చేసాడు.