Home > Flash News > ‘ బెంజ్ ’ న్యూ కారు..

‘ బెంజ్ ’ న్యూ కారు..

విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ అయిన మెర్సిడెజ్ బెంజ్ నూతనంగా ‘ ఏఎంజీ జీఎల్ సీ 43 కూపే ’ ను భారత మార్కెట్ లో విడుదుల
చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు ధర రూ 74.8 లక్షలుగా నిర్ణయించారు. ఏఎంజీ లైన్ లోనే తయారైన ఈ కొత్త ఎస్ యూవీ కూపేలో అదనపు
ఫీచర్లు ఉన్నాయని మెర్సిడెజ్ సీఈవో రోలాండ్ ఫోల్జర్ పెర్కొన్నారు. 100 కి.మీల వేగాన్ని కేవలం 4.9 సెకండ్ల లో
అందుకోనుందన్నారు. పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ లు ఉన్నాయి. ఈ కారులో 367 హెచ్ పీ
శక్తినివ్వనున్నది. ప్రస్తుతం ఇది 8 మోడల్ గా ఈ సంవత్సరంలో 7.171 యూనిట్లు వాహనాలను విక్రయించినట్లు పెర్కొన్నారు. భారత్ లో
లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూర్, పూణెలలో ఏఎంజీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు
భారత్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

Updated : 22 July 2017 5:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top