కొన్ని ప్రమాదాలను అసలు ఊహించలేం. తప్పు మనది కాకపోవచ్చు, ముప్పు ఎటునుంచి వస్తుందో తెలియకపోవచ్చు. కానీ యాక్సిడెంట్ ఫలితాలు మాత్రం దారుణంగా ఉంటాయి. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో అలాంటి ఘోరమే జరిగింది. రాకెట్ వేగంతో అడ్డగోలుగా దూసుకొచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఐదుగురు మంటల్లో కాలిపోయారు.
హిల్స్ ఏరియాలోని ఓ చౌరస్తా దీనికి వేదికైంది. మెర్సిడేస్ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి దూసుకొచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ గర్భిణి, ఏడాది వయసున్న ఆమె కూతురు సహా ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. భారీస్థాయిలో మంటలు ఎగసిపడ్డాడు. దగ్గర్లోని సీసీకెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. మెర్సిడెస్ కారును నడిపింది నికోల్ లింటన్ అనే నర్సు అని, ఆమె గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలారు.
TW: Surveillance video shows violent crash that left 5 dead, intersection of La Brea and Slauson, about an hour ago. pic.twitter.com/gIb1hRTiU9
— Ray 鄺羡華 (@raykwong) August 5, 2022