కంగ్రాట్స్ మెర్సీ మార్గరెట్ - MicTv.in - Telugu News
mictv telugu

కంగ్రాట్స్ మెర్సీ మార్గరెట్

June 22, 2017

2017 కేంద్ర సాహిత్య అవార్డులు ప్రకటించింది కేంద్ర సాహిత్య పరిషత్తు. తెలంగాణ రాష్ర్టం నుండి యువ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గాను యువ కవయిత్రి మెర్సీ మార్గరెట్ ను ఎన్నిక చేసింది. అలాగే వాసాల నరసయ్యను కేంద్ర సాహిత్య బాల సాహితీవేత్తగా ప్రకటించింది.

వాసాల నరసయ్య
వాసాల నరసయ్య పూర్వీకులు కరీంనగర్ వాస్తవ్యులు. తను మాత్రం నిజామాబాద్ మెట్ పల్లిలో పుట్టి పెరిగారు. వృత్తిరిత్యా పోస్టల్ డిపార్ట్ మెంటులో ఉద్యోగం చేస్తూనే బాలలకు సంబంధించిన కథలు రాసేవారు. కేవలం బాల సాహిత్యం తప్పితే వేరే ఏ ప్రక్రియలోకి తర్జుమా అవకుండా నిర్విరామంగా పిల్లల కోసం అనేక కథలు, గేయాలు రాసారు. లెక్కకు మించిన పుస్తకాలు వెలువరించారు. ఆయన కృషికి ఫలితం దక్కినందుకు వాసాల నరసయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెర్సీ మార్గరెట్

ఈ కవయిత్రి రాసే ప్రతీ అక్షరంలో చిక్కని గాఢత వుంటుంది. ది యంగ్ అండ్ డైనమిక్ పొయెటర్ మెర్సీ. కవిత్వం ఇంత చిక్కగా రాస్తారా అనడానికి మెర్సీ మార్గరెట్ కవిత్వం ఒక తార్కాణంగా నిలిచింది. తెలుగు సాహిత్యంలో మెర్సీది ఒక విశేషమైన స్థానం. తను రచించిన ‘ మాటల మడుగు ’ కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని పొందినందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెర్సీ మార్గరెట్.
కేంద్ర సాహిత్య అవార్డులు అందుకున్న పురస్కార గ్రహీతలకు ‘ మైక్ టీవీ ’ కంగ్రాట్యులేషన్స్ చెబుతోంది. ఇలాంటి అవార్డులు ఆయా రంగాల్లో వున్నవారికి మంచి బూస్టునిస్తాయి కదా !