అదిరింది’కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

అదిరింది’కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్

November 2, 2017

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలతో వివాదాస్పదంగా మారిన తమిళ ‘మెర్సల్’ మూవీ తెలుగు వెర్షన్ ‘అదిరింది’కి విడుదలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఎట్టకేలకు అనుమతినిచ్చింది. హీరో విజయ్ జీఎస్టీని, ఇతర ప్రభుత్వ వ్యవహారాలను తిట్టే డైలాగులను కత్తిరించకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొంది. మెర్సల్ తోపాటు విడుదలవాల్సిన అదిరింది.. వివాదాల వల్ల, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంతో జాప్యం వల్ల దీని విడుదల రెండుసార్లు వాయిదా పడింది. మెర్సల్  సినిమాపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే.