తెలంగాణలో 800 కోట్ల రైలు బోగీ ఫ్యాక్టరీ   - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 800 కోట్ల రైలు బోగీ ఫ్యాక్టరీ  

October 27, 2017

తెలంగాణ పారిశ్రామిక ప్రగతి పథంలో మరో మైలురాయి పడింది. మెట్రో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై శుక్రవారం ఒప్పందం కుదిరింది. తెలంగాణ సర్కారుతో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఐటీసీ కాకతీయలో జరిగిన సమావేశంలో పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు వ్యయం రూ. 800 కోట్లు. సంగారెడ్డి సమీపంలోని కొండకల్‌లో మెట్రో రైలుబోగీల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు. దీని వల్ల 2000 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వేల మందికి పరోక్షంగా జీవనోపాధి కలుగులుతుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది