ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం..ఈ రెండింటి గురించి తెలియని వారుండరు. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న కోట్లమంది వీటి సేవలను ఉచితంగా పొందుతున్నాడు. నేటి యువత గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. రోజు మొత్తం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలోనే కాలక్షేపం చేస్తున్నారు. వీటి ద్వారా చాలామంది సెలబ్రిటీస్ కూడా అయిపోయారు. అయితే ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు మెటా సంస్థ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా పొందుతున్న సేవలకు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. బ్లూటిక్ కలిగిన ఉన్న వారి నుంచి మాత్రమే ఛార్జీలు వసూలు చేయనుంది. ఇప్పటి వరకు ఫ్రీగా లభిస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రాం సేవలు ఇక భారం కానున్నాయి.
ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ పెట్టిన రూల్‌నే మెటా(facebook) యాజమాన్యం కూడా ఫాలో అయిపోతోంది. యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ట్విట్టర్ తరహాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లూటిక్ హోల్డర్లకు ఛార్జీలను విధించింది. ప్రభుత్వ ఐడీలతో ఫేస్‌బుక్ బ్లూటిక్ హోల్డర్ల అకౌంట్ల పరిశీలించి.. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ రూల్‌ను ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం ఐఓస్ యూజర్లు నెలకు రూ.14.99 డాలర్లు, వెబ్ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే అన్నిదేశాల్లో యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు మెటా సిద్ధమైంది. ఫేక్ అకౌంట్ల బెడదను బ్లూ వెరిఫికేషన్ తొలగిస్తోందని మెటా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ కారణంగా యూజర్లు సురక్షితంగా ఉండడంతో పాటు..వారిలో నమ్మకం పెరుగుతుందని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.