meta-to-work on artificial intelligence
mictv telugu

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లోకి అడుగుపెడుతున్న మెటా

February 28, 2023

 meta-to-work on artificial intelligence

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్….ప్రపంచానికి ఇదో కొత్త పిచ్చి ఇప్పుడు. అందరి పరుగులూ దీని వెనుకనే. పెద్ద పెద్ద కంపెనీలు ఇందుకు అతీతులు కాదు. మైక్రోసాఫ్ట్ ప్పటికే చాట్ జీపీటీ అంటూ రొత్త టూల్ సృష్టించి రేసులో ముందంజలో ఉంది.గూగుల్ కూడా ఏఐ టూల్ అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించింది. ఇప్పుడు ఈ రేసులోకి మెటా కూడా ఎంటర్ అయింది. తాము ఏమీ తక్కువ తినలేదంటోంది. కృత్రిమ మేథ కోసం ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ముందు వాట్సాప్, ఇన్స్టాలో చాట్ జీపీటీ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామపి చెబుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోసం ఓ టీమ్ ను ఏర్పరచామని దానికి మెటా ఛీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ లీడర్ గా ఉంటారని జుకర్ బర్గ్ చెప్పారు. ఈ టీమ్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని ఏఐ పర్సనాస్ ను రూపొందిస్తారని తెలిపారు. దీని కోసం ఇంకా చాలా వర్క్ చేయాలని అంటున్నారు. ప్రస్తుతానికి టెక్స్ట్, ఇమేజెస్, వీడియోలను పలు రూపాల్లో అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం రెసిషన్ టైమ్ నడుస్తోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అంతేకాదు కాస్ట్ కటింగ్ పనులను కూడా స్టార్ చేసాయి. కానీ మరోవైపు ఏఐ మీద కూడా దృష్టి పెడుతున్నాయి. ప్రపంచం అంతా పరుగెడుతున్నప్పడు తాము ఒక్కరం వెనుక ఉండిపోతే ఎలా అనుకుంటున్నోరో ఏంటో కానీ అన్ని బిగ్ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఓన్ చేసుకుంటున్నాయి.