హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. అర్థగంటలో.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. అర్థగంటలో..

April 22, 2022

00023

 

హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో అర్థగంటలో నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రానున్న అరగంటలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కల్లాల్లోని పంటలను సురక్షితంగా ఉంచుకోవాలని, వానకు తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక భాగ్యనగర వాసులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అంతేకాకుండా, రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 25 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వెల్లడించింది.