తుపాను వెంటపడ్డాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

తుపాను వెంటపడ్డాడు..

September 11, 2017

గంటకు ఇన్ని కి.మీ. వేగంతో తుపాను గాలులు వీస్తున్నాయి.. అని వస్తున్న వార్తలను మనం చదివారం. ఆ గాలులను కూడా టీవీల్లో చూశాం. మరైతే ఈ ఈదురు గాలుల వేగాన్ని ఎలా కొలుస్తారు? అదంతా వాతావరణ శాస్త్రవేత్తల పని కదా.. కానీ ఈ వీడియో చూస్తే వాళ్లెంత కష్టపడతారో అర్థమవుతుంది. గాలి వేగాన్ని కొలిచే యంత్రాలున్నా.. కళ్లముందు చెలరేగుతున్న తుపానును రియల్ టైమ్ లో కొలవాడానికి ఈ శాస్త్రవేత్త ఎంతకు తెగించాడో చూడండి.. అమెరికాలోని ఫ్లోరిడా కీవెస్ట్ వద్ద తుపాను విరుచుకుపడుతున్నప్పుడు జస్టన్ డ్రేన్ అనే వాతావరణ శాస్త్రవేత్త తన కారులోంచి దిగా ఈ వీడియో తీశాడు. పెనుగాలులకు ఎదురెళ్లి.. తూలిపోతూ.. వాటి వేగాన్ని కొలిచాడు. ఈ సమయంలో ఇర్మా తుపాను గంటలకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.