Meters soon for farm motors: CM Jagan
mictv telugu

త్వరలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు : సీఎం జగన్

May 6, 2022

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. అందులో భాగంగా రైతు భరోసా, పంట నష్ట పరిహారం చెల్లింపు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి, ఖరీఫ్ సన్నద్ధత వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు విడుదల, జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్ట పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

జూన్‌లోనే మూడు వేల ట్రాక్టర్లు, 4014 వ్యవసాయ యంత్రాలు, 402 హార్వెస్టర్లను కమ్యూనిటీ హార్వెస్టింగ్ సెంటర్లకు ఇస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ప్రకటించారు. ఇప్పటికే శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని తెలిపారు. మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను రాజకీయ లబ్దికోసమంటూ కొట్టి పారేశారు.