కేంద్రమంత్రి అక్బర్ కామాంధుడు.. సుష్మా.. స్పందించండి! - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రి అక్బర్ కామాంధుడు.. సుష్మా.. స్పందించండి!

October 9, 2018

మీటూ ఉద్యమం చివరకు అధికార పీఠాలను కూడా గడగడలాడిస్తోంది. కేంద్ర ప్రభాత్వాన్ని వణికిస్తోంది. పైకి ఎంతో మర్యాదస్తుల్లా కనిపించే కామాంధుల బండారాన్ని బట్టబయలు చేస్తోంది. విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ తమను లైంగికంగా వేధించాడని, అతని ఏ చర్యలు తీసుకుంటారని  బాధితులు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను నిలదీయడం సంచలనం సృష్టిస్తోంది.

మాజీ ఎడిటర్‌ అయిన ఎంజే అక్బర్‌ తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా జర్నలిస్ట్‌లు చెబుతున్నారు. అతడు హోటల్‌ గదుల్లో ఇంటర్వ్యూలప్పుడు, విధులపై చర్చించేటప్పుడు అసభ్యంగా తాకి హింసించేవాడని అంటున్నారు. ఇన్నాళ్లూ అతని రాజకీయ పలుకుబడి చూసి భయపడ్డామని, మీటూ ఉద్యమం రావడంతో బయటికి చెబుతున్నామని పేర్కొంటున్రు.

MeToo Singes Modi Government as M.J. Akbar is Accused of Sexual Harassment demands raised for his removal from Modi cabinet as Sushma silent on the issue

అక్బర్‌పై ప్రియారమణి అనే జర్నలిస్టు గత ఏడాదే ఆరోపణలు చేశారు. అయితే అతని పేరు  మాత్రం వెల్లడించలేదు. అతడు పచ్చిబూతులు మాట్లాడుతూ ఫోన్‌ చేశారని, అశ్లీల మెసేజీల పంపాడని రమణి గత ఏడాది రాసిన ఓ వ్యాసంలో తెలిపారు. ’నాకు 23 ఏళ్ల వయసున్నప్పుడు ఉద్యోగం కోసం కోసంముంబై హోటల్‌కు వెళ్లాను. ఇంటర్వ్యూలో అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం తాగాలని బలవంతం చేసి, అత్యంత దగ్గరగా కూర్చోవాలని వేధించాడు. కష్టమ్మీద అతని బారి నుంచి తప్పించుకున్నాను..’ అని ఆమె చెప్పారు. తర్వాత పలువురు మహిళా జర్నలిస్టులు అక్బర్‌ తమను కూడా వేధించారని వెల్లడించారు. 17 ఏళ్ల కిందట అక్బర్ తనతో ఇలాగే ప్రవర్తించారని మరో జర్నలిస్టు ప్రేరణ సింగ్ బింద్రా కూడా ట్వీట్ చేశార. కాగా  ప్రస్తుతం నైజిరియాలో ఉన్న అక్బర్ ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు. సుష్మా స్వరాజ్‌ను విలేకర్లు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్బర్‌ గతంలో ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు.